కథలాపూర్, జూన్ 12 : విద్యార్థులు అందరూ ప్రభుత్వం అందించే అన్ని రకాల సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని మండల విద్యాధికారి లోకిని శ్రీనివాస్ అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా సిరికొండ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు, యూనిఫామ్స్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలన్నారు.
బాగా చదివి ఉన్నత స్థానానికి ఎదగాలని. పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు వనతడుపుల రవికుమార్, చంద్రశేఖర్, అనిత శ్రీనివాస్, విజయ, అశోక్, కవిత, సళావుద్దీన్. సిఆర్పి విజయ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.