జగిత్యాల : నిరుపేద మైనారిటీ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ప్రభుత్వం చేయూతనిస్తున్నదని
రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ ( Minister Koppula Eshwar) అన్నారు. శనివారం జగిత్యాలలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు (Sewing machines) పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయంతో ఆర్థికంగా బలోపేతమై ఇతరులకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు.
సీఎం కేసీఆర్ (CM KCR ) అన్ని వర్గాల పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని తెలిపారు. 50 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ (Congress) పార్టీ నేతలు ఏనాడు మైనార్టీ (Minorities) వర్గాల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపన పోలేదన్నారు. నిజమైన సెక్యూలర్ ప్రభుత్వం బీఆర్ఎస్ (BRS ) మాత్రమేనని అన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్కు తెలుసు విమర్శించారు.
మైనార్టీ వర్గాల విద్యార్థులు కోసం 204 మైనారిటీ రెసిడెన్సియల్ పాఠశాలాలను నెలకొల్పారని వెల్లడించారు. విదేశాల్లో చదువుకునే విధంగా రూ. 20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లు సంజయ్ కుమార్, రవిశంకర్, విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ పాల్గొన్నారు.