పెగడపల్లి: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పెగడపల్లి (Pegadapalli) మండలం సుద్దపల్లిలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే మండల కేంద్రంలోని సంఘ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు గాజుల గంగమల్లేశం, ప్రధాన కార్యదర్శి భోగ గంగాధర్, కోశాధికారి భోగ గోపికృష్ణ, మాజీ సర్పంచ్ నేరెళ్ల హారిక- గంగాధర్, మాజీ ఎంపీటీసీ సింగసాని విజయలక్ష్మి- స్వామి, జిల్లా నాయకులు అందే వెంకటేశం, గాలిపెల్లి సత్తయ్య, కట్ల రమేష్ తదితరులు ఉన్నారు.