సారంగాపూర్ : జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కొనాపూర్ బ్రిడ్జ్ వద్ద పనులు త్వరగా పూర్తి చేయాలని బ్రిడ్జ్ వద్ద గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. రోడ్డు సరిగా లేకపోవడం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాయికల్ మండల రామాజీ పెట్,మహిత పూర్ బ్రిడ్జి వద్ద కూడా సమస్య ఉందని పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
కాగా, పలు ప్రభుత్వ కార్యక్రమాల నిమిత్తం అటుగా వెళ్తున్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ఆందోళన చేస్తున్న గ్రామస్తులతో మాట్లాడారు. బ్రిడ్జి దగ్గర అప్రోచ్ రోడ్డు త్వరిత గతిన పూర్తి కి కృషి చేస్తానని హామీనిచ్చారు. సంబంధిత ఈఈ, కాంట్రాక్టర్ తో ఫోన్ లో మాట్లాడి త్వరిత గతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే హామీ ఇవ్వగా గ్రామస్తులు ఆందోళన విరమించారు.