జగిత్యాల : అభివృద్ధి, సక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలం నుంచి స్వచ్ఛందంగా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అన్నారు. గురువారం రాయికల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ అధ్వర్యంలో చింతలూరు గ్రామ వార్డు మెంబర్ సరళ దంపతులు వారి అనుచరులు 10 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్లో పార్టీలోనే ప్రతి ఒక్క కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు.
పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు నాగరాజు, నాయకులు సురేందర్ నాయక్, రాజు,ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాపు రావు, తదితరులు పాల్గొన్నారు.