KCR : సిట్ పేరుతో ఉద్యమ నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ను వేధిస్తున్నారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా నేతలు అన్నారు. కేసీఆర్కు సిట్ నోటీసులను నేతలు ఖండించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ నేతలతో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
ఎల్ రమణ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ కీలక నేతలు పాల్గొన్నారు. సిట్ విచారణ పేరుతో ఉద్యమ నాయకుడిని వేధించడాన్ని వారు తప్పుబట్టారు. ఆదివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. కాంగ్రెస్, రేవంత్ సర్కార్ వేధింపులను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు శాంతియుత ఆందోళనలు చేపట్టనున్నాయి.
ఈ బైక్ ర్యాలీకి జిల్లా నేతలు, కార్యకర్తలు పాల్గొనాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు దావా సురేష్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.