Jeevan Reddy | ప్రాణహిత నదీజలాలు వినియోగంలోకి రావాలంటే మీకు తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మించాలనే ఆలోచన లేదు..చొరవ లేదు. మిగిలింది మేడిగడ్డను మనం పునరుద్దరింపజేసుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని నివాసంలోఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నిన్నటిదాకా మేడిగడ్డను సాకుగా చూపి కేసీఆర్ దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది. కేసీఆర్ దోషి కాదు.. ఈ తెలంగాణ భవిష్యత్‌ను నిర్మాణం చేసిన స్ఫూర్తి ప్రదాత కేసీఆర్ అని అన్నారు.
ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును, మేడిగడ్డ బ్యారేజ్‌ను పునరుద్దరింప జేసుకోగలుగుతం. ఈ వేసవితో మూడు కాలాలు గడిచిపోయింది. ఇక మిగిలింది రెండు కాలాలు. ఈ రెండు కాలాల్లో కూడా చేస్తా అంటే అయితదా.. కాదా తెలియదు కానీ చెప్తున్న నేను. ఇంతకాలమైతే ప్రకృతి సహకరించి మనకు కరువు రాలేదు. రేపు భవిష్యత్ ఏమవుతదో తెలియదు. రేపు కరువొస్తే దానికి జవాబు దారి ఎవరైతరు.. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అయితదంటున్నానన్నారు జీవన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్దరింపబడటమే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్‌కు ఏకైన మార్గమంటున్న. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాస్తవానికి అనుగుణంగా కండ్లు తెరిచినందుకు సంతోషంగా ఉందన్నారు జీవన్ రెడ్డి.
బీఆర్ఎస్ పార్టీలో నా చేరికతో ఒక నూతన అధ్యాయం మొదలు కాబోతుందని జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌తో నా అనుబంధం ఈనాటిది కాదు.. నేను ప్రజా జీవితంలోకి రాక ముందు నుండి కేసీఆర్ వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా నాకు పరిచయం ఉంది. జీవన్ రెడ్డితో ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమైనదని కేసీఆర్ కూడా చెపుతూ ఉంటారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు.
మేడిగడ్డను సాకుగా చూపెట్టి కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టాలని చూశారు
మూడేళ్లు గడిచే సరికి ఇప్పుడు రేవంత్ రెడ్డి దోషిగా మారుతున్నాడు.. అందుకే గత వారం రోజులుగా మేడిగడ్డను ఎలా పునర్నిర్మించాలని చూస్తున్నాడు
రేపు కరువు వస్తే దానికి కారణం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ – మాజీ… pic.twitter.com/rva2vSEGQl
— Telugu Scribe (@TeluguScribe) April 14, 2026
Ambedkar Jayanti | తెలంగాణభవన్‌లో అంబేద్కర్‌కు ఘన నివాళులు.. ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్
Alia Bhatt | ‘డ్రాగన్’ కోసం ఆలియా?.. ప్రశాంత్ నీల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ!
KTR | ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ సర్కారు చేసిన మోసాన్ని ఎండగడుదాం : కేటీఆర్