Fire accident | జగిత్యాల, జూన్ 07 : కరీంనగర్ ప్రధాన రహదారి పక్కనే స్క్రాప్ ధరూర్ గ్రామంలో రెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలో గల ఓ ప్లాస్టిక్ స్క్రాప్ (పాత ప్లాస్టిక్ డబ్బాల) దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మంటలను అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థాలనికి చేరుకుని ఆర్పుతున్నారు. కాగా ధరూర్ గ్రామంలో ఈ రోజు ఉదయం ఓ వృద్ధురాలు మృతి చెందగా, ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా అనంతరం మంటలు గాలికి ఎగిరి గోడ పక్కనే ఉన్న ప్లాస్టిక్ స్క్రాప్ దుకాణంలో పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటుకున్న మంటలను అగ్ని మాపక సిబ్బంది ఆర్పుతున్నారు. పక్కనే పెట్రోల్ బంకు, దాని పక్కనే కార్ల షో రూమ్ ఉంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.