మల్లాపూర్, ఆగస్టు 5: కష్టించి శ్రమించే అన్నదాతలకు యూరియా (Urea) బస్తాల కోసం తిప్పలు తప్పడం లేదు. ఎప్పుడు లేని విధంగా యూరియా బస్తాల కోసం వేకువ జామున నుండే రైతులు గ్రామాల్లోని ఎరువుల దుకాణాల వద్ద పడిగాపులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మంగళవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ (Mallapur) మండలం చిట్టాపూర్ సహకార సంఘం పరిధిలోకి ఓ లారీలో 340 యూరియా బస్తాలు వచ్చాయి. ఈ బస్తాల కోసం సంఘం పరిధిలోని చిట్టాపూర్, ధర్మారం గ్రామాల రైతులు సంబంధిత పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రజలతో ఉదయం నుండి వేచి ఉండడంతో పాటు, సంబంధిత పత్రాలను క్యూ లైన్లో పెట్టారు. చివరికి ఒక్క రైతుకు రెండు బస్తాల చొప్పున యూరియాను అందించారు. చాలామంది రైతులు యూరియా అందక నిరాశతో వెనుదిరిగారు.