వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కర్క ముత్తారెడ్డి స్మారకార్థం గత కొన్నేండ్లుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి వచన కవితల పోటీలు ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలకుగాను పదవ తరగతి లోపు విద్యార్థినీ విద్యార్థులు ఒక విభాగంగా, అన్ని వయసుల వారు మరో విభాగంగా నిర్ణయించామని తెలిపారు. ప్రతి విభాగం నుంచి 5 కవితల చొప్పున మొత్తం 10 ఉత్తమ కవితలకు నగదు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.
పదవ తరగతి లోపు వారికి అంశం అనాథాశ్రయాలకు అమ్మనాన్నలు. విద్యార్థులు ప్రస్తుతం పదవతరగతి లోపు చదువుతుండాలి. వారి విద్యార్హతలు ధృవీకరిస్తూ ప్రధానోపాధ్యాయుని సంతకంతో కూడిన లెటర్ తప్పనిసరి. అన్ని వయసుల వారికి అంశం కుప్పకూలుతున్న ఆలుమగల అనుబంధాలు. కవిత మీ స్వంతం అనే హామీపత్రం తప్పనిసరి. రెండు విభాగాల్లో ఒకరు ఒక కవిత మాత్రమే పంపాలి.
ప్రతి కవిత 20 నుంచి 30 లైన్ల లోపు మాత్రమే ఉండాలి (దీర్ఘ కవితలు స్వీకరించం). కవితలు పోస్టు ద్వారా మాత్రమే పంపించాలి. ఇతరత్రా కవితలు స్వీకరించబోము. కవితలు పంపాల్సిన చిరునామా: కన్వీనర్, వసుంధర విజ్ఞాన వికాస మండలి (రిజిస్టర్డ్), ఇ.నెం-: 13-3/3/6/2ఇ, అవంతినగర్ తోట, మోతీనగర్, హైదరాబాద్-500018కు మార్చి 15వ తేదీలోగా పంపాలి. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన పోన్ నెంబర్: 8096677409.