పాలమూరు, జూన్ 29 : ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొన్న ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్నగర్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఆదివారం కర్ణాటకలోని సింధనూర్కు 32 మంది ప్రయాణికులతో కర్ణాటక ఆర్టీసీ బస్సు బయలుదేరింది.
అర్ధరాత్రి 12 గంటలకు మహబూబ్నగర్ రూరల్ మండలం ధర్మాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొన్నది. బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, లారీ కూడా దెబ్బతిన్నది. బస్సులోని 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పాలమూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.