జగిత్యాల, మార్చి 17, నమస్తే తెలంగాణ : రైతు రుణమాఫీ(Farmer loan waiver )అయిందని చెప్పి అబద్ధపు ప్రచారాలు జరుగుతున్నవి, కానీ వాస్తవిక పరిస్థితులు క్షేత్రస్థాయిలో వేరేలా ఉన్నాయని రైతు నాయకులు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతులు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకసారి గ్రామస్థాయిలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించిన విధంగా రైతు పాలన కార్యక్రమం నిర్వహించి వాస్తవిక పరిస్థితులు తెలుసుకున్నట్లయితే ఇంకా రుణమాఫీ కానీ రైతుల వివరాలు తెలుస్తాయన్నారు.
ఇప్పటివరకు ఎంత ఋణ మాఫీ అయిందో తెలుపాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని రైతులకు 60 శాంతం మాత్రమే రుణ మాఫీ అయిందన్నారు. ఇకనైనా రైతుల ఇబ్బందులను చూసి వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు పన్నాల తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు మిట్టపెల్లి తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి కర్నె రాజేందర్ రెడ్డి, ఇప్ప రాజేందర్ రెడ్డి, తురగ శ్రీధర్ రెడ్డి, రాగుల లింగారెడ్డి, నోముల నర్సింహారెడ్డి,చందు,లక్ష్మారెడ్డి,వెంకన్న పాల్గొన్నారు.