సుల్తానాబాద్ రూరల్ మార్చి 23: పెద్దపల్లి జిల్లా పద్మశాలి న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామపంచాయతీ పరిధిలోని రిసార్ట్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో కుటుంబ సమేతంగా పద్మశాలి న్యాయవాదుల కుటుంబాలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ న్యాయవాదుల బార్ కౌన్సిలర్ సభ్యులు దూస జనార్ధన్ హాజరై మాట్లాడారు.
న్యాయవాదులు అందరూ ఐక్యతతో ఉండి ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించుకునే విధంగా ఉండాలన్నారు. వృత్తి పట్ల అంకితభావంతో ఉంటూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పోటీ తత్వంలో రాణించాలని సూచించారు. ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను న్యాయవాదులు మెరుగు మల్లేశంను అభినందించారు.ఈ కార్యక్రమానికి న్యాయవాదులు కొండ బత్తుల రమేష్, గంజి గణేష్, గోదావరిఖని బార్ అసోసియేషన్ అధ్యక్షులు కౌటం సతీష్ తదితరులు పాల్గొన్నారు.