సారంగాపూర్ : మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు జగిత్యాల డీఎస్పీ రఘుంచందర్ పేర్కొన్నారు. మండలంలోని ప్రముఖ పుణ్య క్షేత్రం పెంబట్ల, కోనాపూర్ లోని శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి ఆలయంలో 24 నుండి 28 వరకు మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలు జరుగనుండడంతో సోమవారం ఆలయాన్ని సందర్శించి భద్రత ఏర్పాట్లు పరిశీలించి పలు సూచనలు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా భద్రత ఏర్పాట్లు ఉండాలన్నారు.
ఆలయం, పరిసర ప్రాంతాలలో పర్యటించి భద్రత ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
ఆలయానికి ఇరు వైపులా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలు లోనికి రాకుండా చూడాలని, రహదారికి అనుకుని షాపులు ఉండకూడదని, ఆలయం ముందు భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. జాతరకు వచ్చే భక్తులు పోలీస్ వారికి సహకరించాలని కోరారు. అనంతరం ఆలయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ సీఐ కృష్ణారెడ్డి, ఎస్ఐ దత్తాద్రి, ఆలయ కార్యనిర్వహణ అధికారి అనూష, ఆలయ ట్రస్టు ఫౌండర్ పొరండ్ల శంకరయ్య, జూనియర్ అసిస్టెంట్ రజినీకాంత్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.