జగిత్యాల : సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల గ్రామీణ మండలం గుల్లపేట గ్రామంలో సముద్రత ఆరోగ్య వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహిం చారు. గ్రామంలో టీబి, హెచ్ఐవి, మధుమేహ, బీపీ పరీక్షలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటి ఆవరణలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులు దరిచేరవన్నారు. ప్రతిఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు సౌజన్య, ఏఎన్ఎం శోభ, శ్రీనివాస్ , కౌన్సిలర్ తిరుపతి, రాజు, శ్రావ్య తదితరులున్నారు.