ధర్మపురి, డిసెంబర్09 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధనలో కీలక మలుపుగా నిలిచిన తెలంగాణ దీక్ష విజయ్ దివస్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలని ధర్మపురి పీఏసీఎస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజైన దీక్ష విజయ్ దివస్ వేడుకలను మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఘనంగా నిర్వహించారు. మొదట ధర్మపురి పట్టణంలోని తెలంగాణ తల్లి, అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ధర్మపురి ప్రభుత్వ దవాఖాన లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ను సాధించిన కేసీఆర్ త్యాగం చిరస్మరణీయమని అభివర్ణించారు. ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో ఢిల్లీని వణికించి ప్రత్యేక రాష్ట్ర ప్రకటనను సాధించిన రోజు దీక్ష విజయ్ దివస్ అన్నారు. 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన వేళ అని, ఆ తేదీని చరిత్రలో మైలురాయిగా గుర్తు చేస్తూ ప్రతిఏడాది డిసెంబర్ 9న వేడుకలు జరుపుకుంటారన్నారు. కేసీఆర్ దీక్ష, ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ ప్రత్యేక రాష్ట్రాన్ని పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచారన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ, నాయకులు అయ్యోరి రాజేష్ కుమార్, సంగి శేఖర్, ఇందారపు రామన్న, చిలివేరి శ్యాంసుందర్, మురికి శ్రీనివాస్, అశోక్, వేణు, కార్తీక్, యూనుస్, లక్ష్మణ్, వొడ్నాల మల్లేశం, మహేశ్, రంజిత్, చుక్క రవి, విజయ్, చీర్నేని నర్సయ్య, జెట్టి రాజన్న, సురేందర్, బద్రీ, ప్రశాంత్, రిషిరెడ్డి, తిరుపతి తదితరులున్నారు.