పెగడపల్లి: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయ పునః నిర్మాణ పనులకు గాను ఇదే గ్రామానికి చెందిన బోయినిపల్లి శాంతపు రావు – సరిత దంపతులు వారి కూతుళ్లు అన్షు, ఆన్య కుటుంబ సభ్యులు మంగళవారం రూ.2.25 లక్షల విరాళం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. గ్రామానికి చెందిన అతి పురాతన ఆంజనేయస్వామి ఆలయం శిథిలావస్థకు చేరగా, శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆలయ పునః నిర్మాణ పనులు చేపడుతున్నారు.
ఆలయ నిర్మాణ పనులకు శాంతపు రావు దంపతులు భారీ స్థాయిలో విరాళం అందజేయడం పట్ల ఆలయ కమిటీ అధ్యక్షుడు ఒరుగల శ్రీనివాస్, కమిటీ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ మాదారపు కరుణాకర్ రావు, ఆలయ కమిటీ సభ్యులు మాసూరి పార్థసారథి, జాల శ్రీకాంత్ రెడ్డి, గొల్లపల్లి రామచంద్రం, గర్వంద శేఖర్, మాదారపు కిషన్ రావు, భోగ గోపికృష్ణ, పొనుగోటి శాంతపు రావు, మల్లేశం, కొమురయ్య తదితరులు ఉన్నారు.