జగిత్యాల : దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పలువురికి దళిత బంధు పథకం ద్వారా మంజూరైన యూనిట్లను గురువారం జగిత్యాల పట్టణంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ దళితుల ఆర్థికాభివృద్ధికే ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. దళిత బంధును సద్వినియోగం చేసుకొని దళితులు ఆర్థికంగా ఎదుగాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ, స్థానిక కౌన్సిలర్లు గుగ్గిళ్ల హరీష్, కుసరి అనిల్, సమిండ్ల వాణి తదితరులు పాల్గొన్నారు.