Sarla Maheshwari: ప్రముఖ దూరదర్శన్ యాంకర్ సరళా మహేశ్వరి కన్నుమూత
Sarla Maheshwari: దూరదర్శన్ యాంకర్ సరళా మహేశ్వరి కన్నుమూశారు. ఆమె వయసు 71 ఏళ్లు. ఆ యాంకర్ మృతి పట్ల దూరదర్శన్ నివాళి అర్పించింది. సరళమైన కంఠం, స్పష్టమైన ఉచ్ఛారణ ఆమె ప్రత్యేకత. హుందాగా ఆమె హిందీ వార్తలు చేదివేవారని డీడీ తన నివాళి పోస్టులో పేర్కొన్నది.
న్యూఢిల్లీ: దూరదర్శన్‌లో వార్తలు చదివిన ప్రముఖ యాంకర్ సరళా మహేశ్వరి( Sarla Maheshwari) కన్నుమూశారు. ఆమె వయసు 71 ఏళ్లు. ఆ యాంకర్ మృతి పట్ల దూరదర్శన్ నివాళి అర్పించింది. సరళమైన కంఠం, స్పష్టమైన ఉచ్ఛారణతో హుందాగా ఆమె హిందీ వార్తలు చేదివేవారు. దూరదర్శన్ ఫ్యామిలీ తరపున సరళా మహేశ్వరి మృతి పట్ల నివాళి అర్పిస్తున్నట్లు డీడీ తన ఎక్స్‌లో ట్వీట్ చేసింది. దూరదర్శన్‌లో ఎంతో గౌరవప్రదమైన న్యూస్‌రీడర్‌గా ఆమెను గుర్తిస్తారని, భారతీయ వార్తాప్రపంచంలో ఆమెకు ప్రత్యేక స్థానం ఉన్నదని, తన స్వరం, ఉచ్ఛారణతో ఆకట్టుకునేవారని, చాలా సింపుల్‌గా ఆమె కనిపించేవారని డీడీ తన ఎక్స్‌లో పేర్కొన్నది.
సరళా మహేశ్వరి 1976లో దూరదర్శన్‌లో చేరారు. 1982లో ఆమె ఫుల్‌టైం న్యూస్ రీడర్ అయ్యారు. 1982లో ఆసియా గేమ్స్, 1991లో రాజీవ్ గాంధీ హత్య లాంటి ఘటనలను ఆమె కవర్ చేశారు. హిందీ భాష ఉచ్ఛరణ, తేలికైన చీరకట్టు ఆమె ప్రత్యేకత. వార్తలు చదివేటప్పుడు చాలా స్థిరంగా ఉండేవారు. పంజాబ్ మిలిటెంట్ల ఊచకోత సమయంలో ఆమె డీడీ వార్తలు చదివారు. 2005లో ఆమె రిజైన్ చేశారు.
ఆ రోజుల్లో లైవ్‌లో న్యూస్ చదివిన యాంకర్‌గా ఆమెకు గుర్తింపు ఉన్నది. 1976లో న్యూస్ అనౌన్సర్‌గా ఆమె డీడీలో చేరారు. పీహెచ్డీ చేస్తూనే ఆ ఉద్యోగం నిర్వర్తించారు. 1984 వరకు న్యూస్ యాంకర్‌గా చేసిందామె. ఆ తర్వాత బ్రిటన్‌లో బీసీసీలో ఉద్యోగం చేసింది. 1986 వరకు బీబీసీ న్యూస్ రీడర్‌గా పనిచేసింది. మళ్లీ 1988లో ఆమె దూరదర్శన్‌లో చేరింది.
दूरदर्शन परिवार की ओर से श्रीमती सरला माहेश्वरी को भावपूर्ण श्रद्धांजलि। वह दूरदर्शन की सम्मानित और प्रतिष्ठित समाचार वाचिका थीं, जिन्होंने अपनी सौम्य आवाज़, सटीक उच्चारण और गरिमापूर्ण प्रस्तुति से भारतीय समाचार जगत में विशेष स्थान बनाया। उनकी सादगी, संयम और व्यक्तित्व ने दर्शकों… pic.twitter.com/Hx8glZI7rk
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) February 12, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

