జగిత్యాల, సెప్టెంబర్ 30 : జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్యప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంపిటిసి, జడ్పిటిసి , గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విషయం విధితమే అని తెలిపారు.
రెండు విడతలలో స్థానిక సంస్థలను, రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
జిల్లాలో మొదటి విడతలో 10 మండలాలు, రెండవ విడుదల 10 మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల జరుగుతాయని అన్నారు. పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ అదనపు భద్రత బలగాలు ఉండేలా చూడాలన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ఎంసిసి నిబంధనలకు విరుద్ధంగా అర్బన్ ప్రాంతాలలో, సోషల్ మీడియా ద్వారా ఉల్లంఘనలు చేస్తే వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని అన్నారు.
ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు సిద్దం చేశామని, సిబ్బందికి ఎన్నికల విధుల నిర్వహణ పట్ల శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయాలని, శాంతి భద్రతలు కూడా అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఎక్కడ కూడా రి -పోల్ జరగకుండా పటిష్ట ఏర్పాట్లు ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్ , జడ్పీ సిఈఓ గౌతమ్ రెడ్డి, డిపిఓ మదన్ మెహన్ జిల్లా నోడల్ అధికారులు, ఎన్నికల విభాగం, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.