సారంగాపూర్, డిసెంబర్ 9 : స్వేఛ్చాయుతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మంగళవారం మండలంలోని రేచపల్లి, లక్ష్మీదేవిపల్లి గ్రామాల్లో, బీర్పూర్ మండలంలోని బీర్పూర్, తుంగూర్ గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం స్వేఛ్చాయుతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ప్రజల్లో భద్రత భావాన్ని పెంపొందించడానికి ఒక ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
ఎవరైన చట్టవిరుద్ధంగా ప్రవర్తించిన, గొడవలు పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్భయంగా తమ ఓటు హక్కును వినయోగించుకోవాలన్నారు. ప్రశాత వాతావారణంలో ఎన్నికల నిర్వహణకు అన్ని వర్గాలవారు సహకరించాలని కోరారు. ఏదైన సంఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల నియమ నిబంధనలు, శాంతి భద్రతలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు గీత, రాజు, సుధీర్‌రావు, ఉమాసాగర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.