వెల్గటూర్ ఏప్రిల్ ల్ 16 : ఎండపల్లి మండలంలోని కొత్తపేటలో జేఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైర్మన్ మహేందర్ రెడ్డి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా బుధవారం ఏఎంసీ చైర్మన్ గోపిక జితేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహేందర్ రెడ్డి చేసే సేవా కార్యక్రమాలు అద్భుతం అని కొనియాడారు.
అనంతరం ప్రభుత్వ విప్ కట్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతి కుమారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు మద్దుల గోపాల్ రెడ్డి, గొల్ల తిరుపతి, మెరుగు మురళి, పోలోజు శ్రీనివాస్ జుపాక ప్రవీణ్, అనుమాల మంజుల, శ్రీనివాస్ రాజయ్య మల్లు రాజన్న తదితరులు పాల్గొన్నారు.