Car Overturn | మెట్పల్లి , ఫిబ్రవరి 8: మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని వెంకటరావుపేట శివారులో 63వ జాతీయ రహదారిపై కారు బోల్తా పడిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు అప్రమత్తమై కారులో ఉన్న వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను అంబులెన్స్ లో మెట్పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవాళ సాయంత్రం మెట్పల్లి పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ మరో ముగ్గురుతో కలిసి తన కారులో నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి నుంచి మెట్పల్లి బయలుదేరారు. కారు మార్గ మధ్యలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి.. అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.
Delhi LG | ఎలాంటి ఫైల్స్ బయటకు వెళ్లకూడదు.. సచివాలయ ఉద్యోగులకు ఢిల్లీ ఎల్జీ కీలక ఆదేశాలు
Congress| అధికార పార్టీ నేతల ప్రచార బోర్డులు.. ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు
BJP | ఢిల్లీలో బీజేపీ ఘన విజయం.. 27 ఏళ్ల తర్వాత రాజధానిలో కాషాయ జెండా