మల్లాపూర్ జులై 4: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే కొందరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే, మాజీ జెడ్పిటిసి లపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని మండల బీఆర్ఎస్ నాయకులు అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. యూరియా అంశంపై కాంగ్రెస్ నేత కృష్ణారావు ఐలాపూర్ రైతు వేదిక వద్ద చర్చకు పిలిచి తమ అధికారం ఉపయోగించి బీఆర్ఎస్ నాయకులను అక్రమ అరెస్టులు చేయించారని ఆరోపించారు.
గ్రామాల్లో యూరియా కొరత ఎంత ఉందో మీ పార్టీకి చెందిన రైతు నాయకులను అడిగితే తెలుస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చివరికి పోలీస్ పహరాలో యూరియా పంపిణీ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కనీసం వార్డు సభ్యుడుగా గెలవలేని నాయకులు ఎమ్మెల్యే సంజయ్, మాజి జెడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పై ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వనతడుపుల నాగరాజు, రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు కొమ్ముల జీవన్ రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్లు ముద్దాం శరత్ గౌడ్, చిట్యాల లక్ష్మణ్, మండల యూత్ అధ్యక్షుడు మేకల సతీష్, పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి గౌడ్, నాయకులు బదనపల్లి ప్రేమ్ కుమార్, కొంపల్లి రాజు, సురేష్, రాజేష్, రాజు, తదితరులు పాల్గొన్నారు.