జగిత్యాల, ఏప్రిల్ 17 : జిల్లాలో బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కార్యకర్తలకు సూచించారు. నూతనంగా ఎన్నికైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ప్రమాణ స్వీకారం గురువారం కాగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.
జగిత్యాల జిల్లాలో బీజేపీ బలోపేతానికి జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు ఆధ్వర్యంలో ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, మాజీ జిల్లా అధ్యక్షుడు మోరపెల్లి సత్యనారాయణ రావు, పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్, నాయకులు డాక్టర్ రఘు, కన్నం అంజయ్య, వివిధ మండల శాఖ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.