Jagityal | జగిత్యాల, ఏప్రిల్ 6 : భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కృషిచేయాలని సూచించారు.
రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ సత్తా చాటుకుంటుందని అన్నారు. జగిత్యాల పట్టణంలో ఆన్ని వార్డులల్లో బిజెపి బలమైన అభ్యర్థులు ఉన్నారని, జగిత్యాల మున్సిపల్ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, సిరికొండ రాజన్న, జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, నాయకులు ఇట్యాల రాము, ముద్దం రాము, వోడ్నాల మహేశ్, వోడ్నాల రమేశ్, నాగభూషణం, రాగిళ్ల నారాయణ, కొక్కు రాములు, మామిడి సతీశ్, బండారి మల్లేశం, జంగిలి మహేష్ సిరిపురం బాలాజీ, జంగిలి రమేశ్, తుమ్మనపల్లి రాజశేఖర్, సుభాశ్ పాల్గొన్నారు.