Bhu Bharati | అంతర్గాం, జూన్ 5: అంతర్గాం మండలం ఆకెనపల్లి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సును మండల తహశీల్దార్ తూము రవీందర్ పటేల్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
భూ యజమానులు, రైతులు తమ భూమి రికార్డులలో ఏమైనా తప్పులు ఉన్నా, అర్హత ఉండి రెవెన్యూ రికార్డుల్లో పేర్లు నమోదు కాకపోయినా, ఇతర భూ సమస్యలు ఉన్నా రెవెన్యూ సదస్సుల్లో రైతులు సమస్యల పరిష్కారం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులను పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.