Trishakti Temple | మెట్పల్లి పట్టణంలోని త్రిశక్తి ఆలయ చతుర్థి వార్షికోత్సవ వేడుకలను ఆలయ అర్చకులు విధమౌళి శర్మ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. వేద పండితులు పుణ్యా వచనం 108 కలిశాలతో అభిషేకం, కుంభాభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు, భక్తులు ముగ్గురమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అభిషేకార్చనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు ద్యావనపెల్లి రాజారాం, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.