జగిత్యాల, ఫిబ్రవరి 28 : మార్చి 28న ఏఐయూసీ(AIUC) చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ మాడిశెట్టి కిరణ్ పిలుపునిచ్చారు. జగిత్యాలలో శుక్రవారం ఛలో పార్లమెంటు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సంక్షేమ చట్టంలో నిబంధనలు ఆయా రాష్ట్రాలకు అనుకూలంగా మార్పులు చేసుకునే నిబంధనలు ఉన్నాయని తెలిపారు.
నష్టపరిహారంతో పాటు, 60 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్, వలస కార్మికులు (ఒక రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల్లో పనిచేయు వారికి) దేశంలో ఎక్కడైనా వర్తించే విధంగా గుర్తింపు కార్డులు ఉండాలని, సంక్షేమ బోర్డులను రద్దు చేసే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలన్నారు.
ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ రామిల్ల రాంబాబు, సలహాదారు మునిగురి హన్మంత్, సహాయక కార్యదర్శి మల్లారపు నర్సయ్య, ఉపాధ్యక్షుడు మామిడి రాజన్న, క్యాషియర్ పూదరి మల్లేశం, ప్రవీణ్, పనగంటి మల్లారెడ్డి, సతీష్ రావు, వెన్న మహేష్, అందె ప్రశాంత్,వెన్న మనీతేజ, రంజిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.