జగిత్యాల : జగిత్యాల పట్టణంలోని 36వ వార్డుకు చెందిన రేవెల్ల రవీందర్ ఇటీవల ఇజ్రాయిల్ దేశంలో మరణించగా వారి కుటుంబ సభ్యులను మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి పరామర్శించారు. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తెప్పించడానికి స్థానిక ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి దృష్టికి తీసికెళ్లామమని అడువాల జ్యోతి తెలిపారు.
ఇజ్రాయిల్ – ఇరాన్ దేశాలలో మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో విమాన రాకపోకలకు కొంత ఇబ్బంది ఉన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఇండియన్ ఎంబసీ సహకారంతో మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తెప్పిస్తామని వారు హామీ ఇచ్చారని తెలిపారు. వీరి వెంట కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.