Sunke Ravi Shankar | కార్పొరేషన్, జూలై 16 : జిల్లాలో రైతులందరికీ సాగునీరు అందించాలందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవి శంకర్ డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రమేల సత్పతిని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నదుల్లో నీరున్న రైతులకు సాగునీరు అందించలేని ఆ సమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని విమర్శించారు. వైపు కాళేశ్వరం వద్ద 98 వేల క్యూసెక్కుల వరద నీరు వృథాగా సముద్రంలోకి వెళుతుందని పేర్కొన్నారు.
ఆ నీటిని ఎత్తిపోస్తే వరద కాలువ కళకళలాడడంతో పాటు మధ్య మానేరు ఎల్ఎండీ, నారాయణపూర్ తదితర రిజర్వాయర్లన్నింటిలోనూ సమృద్ధిగా నీరు అందుతుందని పేర్కొన్నారు. వీటిని చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పై ఉన్న కక్ష సాధింపును రైతులపై చూపించడం సరికాదన్నారు. ఇప్పటికే రైతుల నార్లు అన్ని ఎండీ వృథా అవుతున్నాయని, సరైన సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రాజెక్టులలో నీరు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల్లోకి నీటిని ఎత్తిపోసి వెంటనే రైతులకు సాగు కోసం సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్ రెడ్డి, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, చొప్పదండి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.