Gangadhara | గంగాధర జూలై 4: మహాభారత, రామాయణ ప్రవచనకర్త భూపతి శ్రీనివాస్ కు అరుదైన గౌరవం దక్కింది. గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలో 126 రోజులుగా మహాభారత ప్రవచనాలు ప్రబోధిస్తూ ప్రజల మన్ననలు చురగొంటున్నారు. ప్రవచనకర్త భూపతి శ్రీనివాస్ మహాభారత ప్రవచనాలను ప్రతి రోజు 126 రోజులుగా ప్రబోధించే అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ఇంటర్నేషనల్ వండర్ బుక్ రికార్డు పక్షాన ప్రశంసా పత్రం అందించడానికి ఎంపికైయ్యారు.
అచ్చ తెలుగులోకి అనువదించిన చాగంటి కోటేశ్వరరావు మహాభారతాన్ని శ్రీనివాస్ గురూజీ ప్రవచనాల రూపంలో ప్రజలకు ఏకధాటిగా 126 రోజులపాటు వినిపిస్తున్నారు. మహాభారత ప్రవచనాలు మాత్రమే కాకుండా రామాయణ ఇతివృత్తాన్ని కూడా ప్రజలకు ప్రవచనాలు రూపంలో మండలంలోని మధురానగర్, బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామాల్లో వినిపించారు.
ప్రవచనకర్త శ్రీనివాస్ గురూజీ ఇంటర్నేషనల్ వండర్ బుక్ రికార్డు ప్రశంస పత్రాన్ని సొంతం చేసుకోవడం పట్ల ఆయా గ్రామాల మహాభారత, రామాయణ వారసులు ఆనంద వ్యక్తం చేశారు. కొత్తపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన భూపతి శ్రీనివాస్ చెప్పే ఆధ్యాత్మిక ప్రబోధాలు, ప్రవచనాలు ఆకట్టుకునేలా ఉండడంతో ఆయా గ్రామాల్లో 126 రోజులుగా ప్రవచన కొనసాగడం విశేషంగా చెప్పవచ్చు