MLA Medipalli Satyam | గంగాధర, మే 30:పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. గంగాధర మండలం మంగపేటలో శుక్రవారం 721 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను జిల్లా కలెక్టర్ పమేల సత్పతి తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఒక్క గంగాధర మండలంలోనే 721 మంది అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామన్నారు.
చొప్పదండి నియోజకవర్గం లోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరి చేయడానికి కృషి చేస్తామన్నారు.రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎవరైనా మామూలు అడిగితే మా దృష్టికి తీసుకురండి, లేదా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయండి. సంక్షేమ పథకాలు అందించడంలో అవినీతికి తావు లేదని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందని, గృహజ్యోతి పథకంతో 200 మీట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందజేస్తున్నదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో 21 వేల కోట్లతో ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిందన్నారు. పెండింగ్లో ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్ పెండింగ్ పనులను పూర్తి చేయడానికి రూ.43 కోట్లతో పూర్తి చేయబోతున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేసి కోనసీమగా మార్చుతాము.అతి త్వరలోనే గంగాధర మండలంలో డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జెడ్పి సీఈవో శ్రీనివాస్, తహసిల్దార్ అనుపమ, ఎంపీడీవో రాము, మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, పార్టీ మండల అధ్యక్షుడు పురుమళ్ళ మనోహర్, నాయకులు సత్తు కనకయ్య, కంకణాల రాజగోపాల్ రెడ్డి, రామిడి రాజిరెడ్డి, బైరిశెట్టి సంపత్ తదితరులు పాల్గొన్నారు.