Indiramma Illu | కాల్వ శ్రీరాంపూర్ మే 4 : మండలంలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు కమిటీ సభ్యులకు, నాయకులకు సూచించారు. కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి లో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల ఎంపికపై కమిటీ సభ్యులతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని ఎవరైన డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. రెండు రోజుల్లో అర్హులను గుర్తించి, లబ్ధిదారులను ఎంపిక చేసి నివేదిక తనకు అందించాలని ఆదేశించారు.
అనంతరం పెగడపల్లి-ఓదెల మండలాల శివారులో నూతనంగా నిర్మించిన ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు. మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, మాజీ సర్పంచులు గా జన వీణ సదయ్య. అరెల్లి సుజాత రమేష్. మాదాసి సతీశ్, తులా మనోహర్రావు, నాయకులు శివరామకృష్ణ, ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.