దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్‌లో గురువారం అత్యంత వైభవోపేతంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీలో సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ వెంకటేశ్, మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి