Korutla | కోరుట్ల, జులై 9: క్షణికావేశంలో ఓ భార్య భర్తను రోకలిబండతో తలపై మోది హత్య చేసిన సంఘటన కోరుట్లలో జరిగింది. స్థానికులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని అయ్యప్పగుట్ట బుడగ జంగం కాలం చెందిన ఇప్ప కాశీరాం (35) కు అదే కాలానికి చెందిన రజినీతో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు శైలజ, గంగోత్రి, కుమారుడు శివ ఉన్నారు. భార్య భర్తలు ఇద్దరు కలిసి ట్రాక్టర్‌పై కూలి పనికి వెళుతూ వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
గత కొద్ది నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో రోజు గొడవలు జరుగుతున్నాయి. 15 రోజుల క్రితం భర్తపై రజనీ దాడి చేయడంతో తలపై కుట్లు పడ్డాయి. జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స పొందిన కాశీరాం వారం రోజుల క్రితం ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి పోచమ్మ వన భోజనాలు చేసుకున్నారు. భార్యాభర్తలు వనభోజనాల్లో మద్యం సేవించి రాత్రిపూట ఇంటికి వచ్చి గొడవకు దిగారు. గొడవ జరిగిన తర్వాత కాశీరాం ఇంటి ముందర ఉన్న రేకుల షెడ్డు కింద నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయంలో బయట నిద్రిస్తున్న భర్త కాశిరాంపై భార్య రజనీ రోకలిబండతో తలపై దాడి చేసింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో కాశీరాం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కాశీరాం తల్లి సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న