Road accident | వీణవంక, ఆగస్టు 25 : రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన వీణవంక మండలంలోని రెడ్డిపల్లి-పోతిరెడ్డిపల్లి గ్రామాల మధ్య సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. హిమ్మత్‌నగర్ గ్రామానికి చెందిన ఉండాడి సారయ్య, అతడి భార్య శాంత ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. కాగా రెడ్డిపల్లి-పోతిరెడ్డిపల్లి గ్రామాల మధ్య గల రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించేందుకు ప్రయత్నించగా అతడి ద్విచక్రవాహనం అదుపు తప్పి కిందపడిపోయారు.
కాగా ఇద్దరికి తీవ్ర గాయాలపాలయ్యారు. కాగా వీరిని చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. కాగా ఈ ప్రమాదం ఇసుకలారీలు అధిక లోడుతో వెల్లడం వల్లే రోడ్డంతా గుంతలమయంగా మారిందని స్థానికులు ఆరోపించారు. అలాగే ఇదే రోడ్డుపై రెండు రోజుల క్రితం కూడా పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు తూడి మల్లేష్ బైక్ అదుపుతప్పి కింద పడి కాలు విరిగిందని పలువురు పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.