Helping | కోల్ సిటీ, మే 22: అనారోగ్యంతో బాధపడుతున్న పలువురికి జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిరావహకులు ఆపన్నహస్తం అందించారు. గోదావరిఖనికి చెందిన ఎస్ రత్నాకర్-శశికళ దంపతుల కుమార్తె అమెరికాలోని డల్లాస్ లో ఉంటున్న ప్రణీత-భార్గవ్ పెళ్లి రోజు పురస్కరించుకొని వారి అమ్మ, నాన్నల సహకారంతో స్థానిక జీఎం కాలనీకి చెందిన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పలు కుటుంబాలకు గురువారం నిత్యవసర సరుకులు అందించారు.
అలాగే అమెరికాలోని న్యూజెర్సీలో ఎంఎస్ పూర్తి చేసిన అలేఖ్య పుట్టిన రోజు సందర్భంగా ఆమె తల్లిదండ్రులు పద్మ-ఓంకార్ స్వామిలు అనుదీప్ చారిటేబుల్ ట్రస్టు, మగువ లయన్స్ క్లబ్ సారథ్యంలో ఆరుగురు డయాలసిస్ బాధితులకు నిత్యవసర సరుకులను అందించి మానవీయతను చాటుకున్నారు. పుట్టిన రోజున ఆడంబరాలకు వృథా ఖర్చులు చేయకుండా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చేయూత అందించడం మంచి సంకేతమని పలువురు అభినందించారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.