Fire Accident | కోరుట్లలో అగ్ని ప్రమాదంలో ఇళ్లు దగ్ధం.. రూ.ఆరు లక్షల ఆస్తి నష్టం
కోరుట్ల పట్టణంలోని హజీపురా కాలనీకి చెందిన రజియోద్దీన్ అనే వ్యక్తి ఇంటిలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు రూ.ఆరు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది.
Fire Accident | కోరుట్ల, ఫిబ్రవరి 28 : కోరుట్ల పట్టణంలోని హజీపురా కాలనీకి చెందిన రజియోద్దీన్ అనే వ్యక్తి ఇంటిలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో సుమారు రూ.ఆరు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. బాధిత కుటుంబసభ్యులు, మెట్పల్లి పైర్ స్టేషన్ ఆఫీసర్ కృష్ణకాంత్ కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని హజీపురా కాలనీకి చెందిన రజియోద్దీన్ ఇంటిలో ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.
వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. మంటలు ఉదృతంగా వ్యాప్తించి కిచెన్, బెడ్ రూమ్ లోని బట్టలు, మంచాలు, కిటీకీలు, దర్వాజలు, ఫ్రిజ్లు, ఏసీలు, ఇతర విలువైన సామగ్రి కాలిబూడిదయ్యాయి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసేలోపు ఇంటిలోని సామగ్రి కాలిపోయినట్లు రజియోద్దీన్ వాపోయాడు. సుమారు రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం కలిగిందని తెలిపాడు. మెట్పల్లి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి అంచనా వివరాలను నమోదు చేసుకున్నట్లు పైర్ ఆఫీసర్ కృష్ణహరి తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

