ములుగులో సిద్ధమైన ఐడీవోసీ భవనం
ఆదిదేవత, మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ ఆలయం కేంద్రంగా ములుగు జిల్లాకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పునాదులకు అడుగులు పడ్డాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఇచ్చిన మాటకు కట్టుబడి కేసీఆర్ తన జన్మదిన కానుకగా 2017 ఫిబ్రవరి 17వ తేదీన ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి రాష్ట్రంలోని 33 జిల్లాలతో సమానంగా నిధులు కేటాయించాలనే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన కార్యరూపం దాల్చి వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి వైపు దూసుకెళ్లేందుకు దోహద పడింది.
- నాటి ఆలోచనే నేటి పరిపాలనా సౌధం
- రూ.63.5 కోట్లతో 16 ఎకరాల్లో నిర్మాణం
- త్వరలో ప్రారంభించడానికి ముమ్మర ఏర్పాట్లు
ములుగు, ఆగస్టు5 (నమస్తేతెలంగాణ) : ఆదిదేవత, మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ ఆలయం కేంద్రంగా ములుగు జిల్లాకు చెందిన ప్రభుత్వ కార్యాలయాలకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పునాదులకు అడుగులు పడ్డాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఇచ్చిన మాటకు కట్టుబడి కేసీఆర్ తన జన్మదిన కానుకగా 2017 ఫిబ్రవరి 17వ తేదీన ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి రాష్ట్రంలోని 33 జిల్లాలతో సమానంగా నిధులు కేటాయించాలనే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన కార్యరూపం దాల్చి వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి వైపు దూసుకెళ్లేందుకు దోహద పడింది.
దీంతో పాటు అన్ని జిల్లాల మాదిరిగా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం(ఐడీవోసీ) కోసం బీఆర్ఎస్ సర్కారు హయాంలో గట్టమ్మ దేవాలయం కేంద్రంగా అటవీ శాఖకు చెందిన భూములను రెవెన్యూ శాఖకు బదిలీ చేసి బండారుపల్లి శివారులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆనుకొని ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు 50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. అందులో 16 ఎకరాల భూమిని సమీకృత కలెక్టరేట్ కోసం కేటాయించి గత ప్రభుత్వ హయాంలోనే రూ. 63.5 కోట్లను కలెక్టరేట్ భవన నిర్మాణానికి, రూ.8.5 కోట్ల నిధులను కలెక్టర్, అదనపు కలెక్టర్ల భవన నిర్మాణాల కోసం కేటాయించారు. 2023 జూన్ 7వ తేదీన అప్పటి మంత్రులు కేటీఆర్, దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు ముఖ్య అతిథులుగా హాజరై సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఆరు నెలల పాటు వేగంగా కొనసాగిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధుల కొరతతో మందగించాయి. చివరికు 32 నెలల పాటు పనులు జరిగి తుది దశకు చేరుకొని ప్రారంభానికి సిద్ధమైంది. ప్రస్తుతం వచ్చే శ్రావణ మాసంలో ఈ నెల 13వ తేదీ నుంచి 20 లోగా ముఖ్యమంత్రి, మంత్రులతో ప్రారంభోత్సవానికి ఆర్అండ్బీ శాఖ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తిగా గుట్టలాగా ఉన్న ఎత్తు ప్రాంతంలో ములుగు కలెక్టరేట్ భవనాన్ని నిర్మించగా, ప్రస్తుతం నూతన హంగులతో చుట్టుపక్కన పొలాలతో అద్భుత కట్టడంగా దర్శనమిస్తున్నది. రాష్ట్రంలోనే అత్యంత సుందరంగా ములుగు కలెక్టరేట్ భవన సముదాయం నిలువనున్నది.
కలెక్టరేట్ సముదాయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం
ఎంతో ముందు చూపు ఆలోచనతో గట్టమ్మ పరిసర ప్రాంతాల్లో కార్యాలయాల ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. సమీ కృత కలెక్టరేట్‌తో పాటు 300 పడకల ప్రభుత్వ దవాఖాన పూర్తి కాగా, ప్రస్తుతం అందులో మెడికల్ కళాశాల నడుస్తున్నది. దాని పక్కనే గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన మెడికల్ కాలేజీ భవన నిర్మాణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. గిరిజన యూనివర్సిటీ కోసం గట్టమ్మ సమీపంలో 347 ఎకరాల స్థలాన్ని కేటాయించగా ప్రహరీ నిర్మాణ పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. ఒకే ప్రాంతంలో ప్రజలకు అన్ని సేవలు అందేలా కొనసాగుతున్న కార్యాలయాల నిర్మాణ పనులతో గట్టమ్మ ప్రాంతం అభివృద్దికి దిక్సూచిగా మారింది.
సమీకృత కలెక్టరేట్ పక్కనే ఎస్పీ కార్యాలయం కోసం భూమిని కేటాయించడంతో పాటు దాని పక్కనే కోర్టు భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారు. ఆ ప్రాంతంలో కోర్టు భవన నిర్మాణ పనులు సైతం ఊపందుకున్నాయి. ఈ నెల 13వ నుండి 20వ తేదీలోగా ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పర్యటించి సమీ కృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. గట్టమ్మ ఎదురుగా భారీ ఎత్తున పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హ్యామ్ రోడ్ల పైలాన్‌తో పాటు ఇంచర్ల సమీపంలో నిర్మించిన ఇందిర మహిళా శక్తి భవనాన్ని, ములుగు మండలంలోని పొట్లాపూర్ ఎత్తిపోతల పథకం, మంగపేట, మల్లంపల్లి లో తహసీల్దార్ కార్యాలయాలు, మేడారంలో ఆర్అండ్బీ అతిథి గృహం, ములుగులో పీఆర్ ఎస్ఈ కార్యాలయం, ఏటూరునాగారంలో ఐటీడీఏ భవనం వంటి నిర్మాణ పనులకు కలెక్టరేట్ ఆవరణలో ప్రారంభోత్సవాలతో పాటు శంకుస్థాపనలకు శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

