Ganneruvaram | గన్నేరువరం, మే 25 : గన్నేరువరం మండలంలోని పారువెల్ల, గన్నేరువరం లో సోమవారం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. తూకం వేసిన సంచులు తడిసిపోయాయి. తడిసిన ధాన్యాన్ని ఎలాంటి కోతలు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
ఈదురుగాలతో కూడిన వర్షానికి విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపోయి ఇండ్లపై పడ్డాయి. పారువెల్లలో ఈదురుగాలులకు చెట్టు పడి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పాక్షికంగా ధ్వంసమైంది. కాగా ఈ ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.