Godavarikhani | కోల్ సిటీ, ఆగస్టు 11: కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖని రమేష్ నగర్ ఆదర్శ ఆటో యూనియన్ అడ్డా ఆటో డ్రైవర్లకు ఉచితంగా గుండె వ్యాధి నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 120 మంది ఆటో డ్రైవర్లకు ఆస్పత్రి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు, డీఎంఓ డాక్టర్ హర్షిత్ వైద్య పరీక్షలు చేశారు. అవసరమైన వారికి బీపీ, షుగర్, ఈసీటీ, 2డీ ఏకో పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేశారు.
ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మెడికవర్ ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చడంలో ఆటో డ్రైవర్లు మానసిక ఒత్తిళ్లకు గురి గాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు ఎస్.మొగిళి, ప్రదీప్, లక్ష్మీరాజం, మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, బొంగోని హరీష్, రమేష్ తోపాటు అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.