సారంగాపూర్ : కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్ ( Labour Codes) చట్టాలను రద్దు చేయాలని పంచాయతీ ఎంప్లాయ్స్ ఆండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ( CITU ) రాష్ట్ర ఉపాధ్యక్షులు పులి మల్లేశం డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల పరిషత్ కార్యలయంలో ఎంపీడీవో ఎండి సలీమ్ కు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈనెల 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నామని వివరించారు.
కార్మికులు 12గంటలు పనిచేయాలని, వ్యవసాయ కార్మికులకు తీపుకువచ్చిన జీవోలను ఉప సంహరించుకోవాలన్నారు. మల్టీపర్సస్ విధానం రద్దుచేయాలని, జీవో నంబర్ 51ని సవరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మికుల సంఘం మండల అధ్యక్షులు ఎవుసం కొండయ్య, ఉపాధ్యక్షులు ఉప్పులపు పోసాని, కోశాధికారి బెక్కం లక్ష్మీరాజం, చిల్ముల లచ్చన్న, దుబ్బరాజు, తదితరులు పాల్గొన్నారు.