ISRO | ఇస్రోలో యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశం.. అర్హతలు, దరఖాస్తు వివరాలివే
ISRO : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారికి ఇందులో అవకాశం కల్పిస్తోంది. కనీసం 60 శాతం మార్కులు ఉన్నవారు అర్హులు.
ISRO : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్)లో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఉంది. ఇస్రో.. ప్రపంచంలోనే అత్యుత్తమ అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో ఒకటి. అనేక విజయాలు సాధించింది. ఇలాంటి సంస్థకు పని చేయడం అంటే దేశానికి సేవ చేయడమే అని భావించే వారు ఎందరో. అలాంటివారి కోసం ఒక అవకాశం కల్పిస్తోంది ఇస్రో. ఈ సంస్థలో ఇంటర్న్‌షిప్ చేసేందుకు ఔత్సాహిక యువత నుంచి దరఖాస్తులు కోరుతోంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారికి ఇందులో అవకాశం కల్పిస్తోంది. కనీసం 60 శాతం మార్కులు ఉన్నవారు లేదా సీజీపీఏలో 10కి 6.32 శాతం వచ్చిన వారు అర్హులు. భారతీయులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇస్రోకు సంబంధించిన అనేక యూనిట్లలో, వివిధ విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ పని చేసిన వారికి సర్టిఫికేషన్ లభిస్తుంది. ఇది భవిష్యత్తులో ఇతర సంస్థల్లో ఉద్యోగాలకు, ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది. అయితే, ఈ ఇంటర్న్‌షిప్‌నకు సంబంధించి ఎలాంటి పారితోషికం ఉండదు. పైగా వసతి, భోజన ఖర్చులు విద్యార్థులే భరించుకోవాలి. ఇటీవలి కాలంలో ఇస్రోలో అనేకమంది సైంటిస్టులు రాజీనామా చేస్తున్నారు. వారిలో ఉన్నత విభాగాల్లో పని చేస్తున్న సీనియర్లు కూడా ఉన్నారు.
వరుసగా సైంటిస్టులు రాజీనామా చేస్తుండటం సంచలనంగా మారింది. దీంతో ప్రస్తుతం ఇస్రోలో భారీగా ఖాళీలున్నట్లు తెలుస్తోంది. పదింట మూడు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 20,269 పోస్టులకుగాను ప్రస్తుతం 5,632 ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు సమాచారం. ఇస్రోలో ఈ స్థాయిలో సిబ్బంది కొరత ఉండటం రెండున్నర దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి. 2001-2002లో ఇక్కడ 14,847 మంది పని చేశారు. ఇస్రోలో ఇంటర్న్‌షిప్ పూర్తి వివరాల కోసం సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- application
- eligibility
- intern
- ISRO
RELATED ARTICLES
తాజా వార్తలు
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
Priyanka Gandhi | బీజేపీ, ఆరెస్సెస్ విదేశీ అంటూ నా తల్లిని విమర్శించాయి : ప్రియాంక గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

