చేయి తడిపితేనే ఇందిరమ్మ ఇల్లు!
గూడులేని నిరుపేదలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ, లబ్ధ్దిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది.
- ఇందిరమ్మ కమిటీ సభ్యుల కక్కుర్తి?
- కోరపల్లిలో 15వేల నుంచి 50వేల వరకు వసూలు?
- ప్రజావాణిలో గ్రామస్తుల ఫిర్యాదు
- విచారణకు కరీంనగర్ కలెక్టర్ ఆదేశం
‘ఇందిరమ్మ ఇండ్ల పథకం అవినీతిమయంగా మారిందా..? ఇండ్ల ఎంపిక ప్రక్రియలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా..? అర్హులు.. అనర్హుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారా..? పైసలిస్తేనే లిస్టులో పేరు నమోదు చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. సోమవారం కోరపల్లి గ్రామస్తులు కరీంనగర్లో కలెక్టర్‌కు ఇందిరమ్మ కమిటీ సభ్యుల అక్రమ వసూళ్లపై ఆధారాలతో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతున్నది.
జమ్మికుంట, మార్చి17 : గూడులేని నిరుపేదలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ, లబ్ధ్దిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ నాయకులు, సానుభూతిపరులకు కమిటీ బాధ్యతలు అప్పగించినట్టు ప్రచారం ఉన్నది. అయితే ఈ కమిటీ సభ్యులు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ అనర్హులకే ఇండ్లు మంజూరు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జమ్మికుంట మండలంలో 20 గ్రామాలుండగా, మొదటి విడుత కింద 359 ఇండ్లు మంజూరయ్యాయి.
మండలంలోని కోరపల్లి గ్రామానికి మొదటి విడుతగా 32 ఇండ్లు రాగా, ప్రస్తుతం ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. కాగా, ఇందిరమ్మ కమిటీ సభ్యుల తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉందని, లక్షలాది రూపాయలు అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గ్రామానికి మొగిలిపాక లక్ష్మణ్, గండి చంద్రమోహన్ సోమవారం కరీంనగర్ కలెక్టర్ చిత్రామిశ్రాకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల సంతకాలతో కూడిన ఫిర్యాదును ప్రజావాణిలో అందజేశారు.
కొందరి వద్ద నుంచి యూపీఐల ద్వారా నగదు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇందిరమ్మ కమిటీ సభ్యుల అరాచకం అంతా.. ఇంతా కాదని తెలుస్తున్నది. వసూళ్ల సమయంలో బెదిరింపులకు సంబంధించిన ఆడియోలు ఫిర్యాదుదారుల వద్ద ఉన్నట్టు తెలిసింది. మొదటి విడుత ఎంపిక పారదర్శకంగా జరుగలేదని, మొదటి విడుత వసూళ్లు చేశారని, ఇప్పుడు రెండో విడుత అక్రమ వసూళ్లకు తెరలేపారని ఆరోపించారు.
ఇండ్ల ఎంపికకు ముందే.. ఒక్కో లబ్ధిదారుడి నుంచి 15వేల నుంచి 50వేల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని గ్రామస్తులు చెబుతున్నారు. ఇళ్లు రావాలన్నా.. లిస్టులో పేరుండాలన్నా.. ఎంతో కొంత ముట్ట జెప్పాలని, లేకుంటే ఇళ్లు రాదని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులుగాని, పాలకులుగాని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ‘ఇందిరమ్మ’ వసూళ్లపై ఎంపీడీవో పద్మజ, హౌసింగ్ ఏఈ ఐశ్వర్యను వివరణ కోరగా, ఫిర్యాదు విషయం తెలిసిందని, విచారణ జరుగుతున్నదని చెప్పారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లిలో పంతుళ్ల కొరత.. ఇంట్లో పూజలకూ దొరకని పురోహితులు!
YS Sharmila | వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్.. కేసరపల్లి నివాసంలో నిర్బంధం..!
Sircilla | నేరెళ్ల గురుకుల పాఠశాల వద్ద ఆర్టీసీ బస్సు–డీసీఎం ఢీ.. డీసీఎం డ్రైవర్‌కు గాయాలు
Gautam Gambhir: ప్రమాదంలో బౌలర్ల కెరీర్: గౌతం గంభీర్
YS Jagan | చంద్రబాబు గారూ ఇప్పటికైనా బీసీలకు క్షమాపణ చెప్పండి.. వైఎస్ జగన్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

