కార్పొరేషన్ మార్చి 25 : కేంద్ర మంత్రిగా ఉండి ఇష్టమొచ్చినట్టుగా నిరాధర ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను తిట్టినంతమాత్రాన పెద్ద లీడర్లు కాలేరని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం కేటీఆర్ ర్యాలీకి యువత నుంచి వచ్చిన స్పందన చూసి బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు లాగులు తడిశాయన్నారు. కేటీఆర్ ను విమర్శించే స్థాయి సునీల్ రావుకు లేదన్నారు. కేటీఆర్ కాలి గోటికి కూడా సునీల్ రావు సరిపోడని విమర్శించారు.
సునీల్ రావుకు మేయర్ హోదా ఇచ్చిందే బి.అర్.ఎస్. అని గుర్తు చేశారు. అధికారం కోసం పార్టీ నాయకులను జోకే చరిత్ర సునీల్ రావుదని విమర్శించారు. కరీంనగర్ రాజకీయాల్లో ఊసర వెళ్లిగా సునీల్ రావుకు పేరుందని విమర్శించారు. ఊసర వెల్లి సునీల్ రావు పట్ల బండి సంజయ్ జాగ్రత్త గా ఉండాలని కేంద్ర మంత్రి కి సూచించారు. బీఆర్ఎస్ నేతలను విమర్శిస్తే సునీల్ రావు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ అభివృద్ధి మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తోనే సాధ్యమైందని గుర్తు చేశారు.15 నెలల కాలంలో మంత్రిగా పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్ రెడ్డి, మెరుగు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, ఆరే రవి, తదితరులు పాల్గొన్నారు.