Handpumps Repair | చిగురుమామిడి, ఏప్రిల్ 3 : మండలంలో రోజురోజుకు నీటి ఎద్దడి తీవ్రతరం అవుతోంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మెకానిక్ ద్వారా చేతిపంపుల రిపేరును చేపడుతున్నారు.
మండలంలోని చిగురుమామిడి, సుందరగిరి, బొమ్మనపల్లి గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండడంతో నివారణకుగాను చేతిపంపుల రిపేర్లు చేపట్టడం జరుగుతుంది. గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టడం జరుగుతుందని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ దాసరి సువిశాల తెలిపారు.
రోజురోజుకు ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని తద్వారా నీటి ఎద్దడికి అవకాశాలు ఏర్పడుతున్నాయని సువిశాల అన్నారు. మండలంలో 148 చేతి పంపులకుగాను 30 చేతిపంపులను యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేపట్టడం జరిగిందన్నారు.
నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని.. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలను గుర్తించి పరిష్కరిస్తామని ఏఈ సువిశాల పేర్కొన్నారు. కాగా గత బీఆర్ఎస్ పాలనలో నీటి ఎద్దడి లేదని.. ప్రభుత్వం ముందస్తుగానే అన్ని రకాల చర్యలు చేపట్టిందని పలు గ్రామాల్లో ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Pooja Hegde | శ్రీకాళహస్తీ రాహుకేతు పూజలో పాల్గొన్న పూజా హెగ్డే
A Raja: బొట్టు పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు.. డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు