నాసిక్: తాను నడుపుతున్న ట్రక్‌లోని రూ.400 కోట్ల డబ్బును కొందరు దోచుకున్నారని నిరుడు అక్టోబర్ 22న నాసిక్‌లో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు నకిలీదిగా తేలింది. దీంతో నిర్దోషులను కోర్టు విడుదల చేసింది. సందీప్ పాటిల్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది.
దీనికి సంబంధించి అతడు విడుదల చేసిన వీడియోను పోలీసులు పరిశీలించగా.. అతడు చెప్పిన కథనానికి, అతడు ప్రయాణించిన మార్గానికి, కాల్ రికార్డులకు, సమయాలకు మధ్య పొంతన కుదరలేదు. దీంతో ఈ కేసులో పాటిల్ ఆరోపణల మేరకు అరెస్ట్ చేసిన ఏడుగురిని ఇగత్పురి కోర్ట్ నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది.