Handloom Day | ఓదెల , ఆగస్టు 7 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు .ఓదెల లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లను పంచారు. స్థానిక చేనేత కార్మికులకు చేనేత టవల్స్ తో ఘనంగా సన్మానం చేశారు.
ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు ఇప్పనపల్లి వెంకటేశ్వర్లు, మెరుగు సారంగం, క్యాతం వెంకటేశ్వర్లు, క్యాతం రాజేందర్ ప్రసాద్, క్యాతం శ్రీనివాస్, క్యాతం సదానందం, డాక్టర్ రాజు, ఆడెపు రవీందర్, వంగరి రమేష్, ఉరకొండ రామస్వామి, బూర కనకయ్య, బూర రవి, బూర రామచందర్, పద్మశాలి కుల బంధువులు పాల్గొన్నారు.