కలెక్టరేట్ / సిరిసిల్ల రూరల్ ఆగస్టు 8: నిరుపేదలకు నీడ కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన గృహలక్ష్మి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ని బంధనల మేరకు లబ్ధిదారులను పార్టీలకతీతంగా పకడ్బందీగా ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు విబేధాలు వీడి సమన్వయంతో పనిచేసి సర్కారు లక్ష్యాన్ని నెరవేర్చాలని దిశానిర్దేశం చేశారు. మంగళవారం రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో గృ హలక్షి పథకం అమలుతీరు తెన్నులు, పలు అభివృ ద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. సిరిసిల్ల మున్సిపల్లో ఇం టింటా సర్వే చేస్తే 2800 మంది ఇండ్లు లేని పేదలు ఉన్నట్లు తేలిందన్నారు. వీరిలో ఇప్పటికే 2000 మందికి డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేశామ ని చెప్పారు. ప్రభుత్వం గృహలక్ష్మి కింద నియోజకవర్గానికి మూడు వేల ఇండ్లను మంజూరు చేసిందన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారులు టీమ్‌వర్క్ గా పనిచేసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి, గుడిసెలో ఉన్న వారిని గుర్తించి ఇండ్లను మంజూరు చేయాలన్నారు. తర్వాతి క్రమంలో శిథిలావస్థలో ఉన్న వా రికి ఇండ్ల మంజూరులో ప్రాధాన్యం ఇవ్వాలన్నా రు. ఇప్పటికే సర్కారు సంక్షేమ ఫలాలు అందిన వారికి తదుపరి దశలో కేటాయించాలన్నారు. అలా గే 40 రోజుల్లో రైతులకు రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. సిరిసిల్లలోని బీవైనగర్, సుందరయ్యనగర్, పద్మనగర్‌లో పొజిషన్లో ఉన్న 4200 మందికి రిజిస్ట్రేషన్ అయి బ్యాంకు లోన్ వచ్చేలా పట్టాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 15లోగా ప్రభుత్వ జీవో జారీ అయ్యేలా చూ స్తానని ప్రకటించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో రెండో విడత దళితబంధు పథకంలో గుంట భూమి లేని వారికి యూనిట్లు మంజూరు చేయాలని సూ చించారు. సిరిసిల్లను వరద ముప్పు నుంచి తప్పించేందుకు శాశ్వతంగా ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్రక్రియను చేపడతామని చెప్పారు.
ఇందుకోసం ఈఎన్సీ క్షేత్ర అధ్యయనం చేసి ఆ దిశగా డిజైన్ చేస్తామని పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో వరద ముప్పు లేకుండా చూసేందుకు రూ.10 కోట్లు ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సెస్ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలపై క్షేత్ర స్థాయి లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన పనులను గడపగడపకూ వెళ్లి తెలియజేయాలని నిర్దేశించారు. సమావేశంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి, న్యాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీఎస్‌పీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, అదనపు కలెక్టర్లు బీసత్యప్రసాద్, ఎన్.ఖీమ్యానాయక్, బీసీ అభివృద్ధి శాఖ అధికారి నీల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.